Sunday 6 February, 2011

ఇదేం రాజ్యం???????

అవును నేను మాట్లాడేది ప్రముఖ నటుడు, మెగాస్టార్ గా ఆంధ్ర(బాబోయ్ నేను చెప్పేది మొత్తం ఆంధ్ర ప్రదేశ్ గురించి... మనందరం ఇంకా ఆంధ్రులమే) అభిమానుల అభిమానాలు చూరగొన్న చిరంజీవి గారి ఆశల, ఆశయాల రూపం 'ప్రజా రాజ్యం' గురించే! ప్రస్తుతం అది లేదనుకోండి.... ఐనా పేరులో ఉన్నట్టుగా ప్రజల స్వామ్యం అనే పలుకుబడి ఉన్న రాజకీయం ఏమైనా నిజంగా ప్రజా రాజ్యమా... కాదు కదా. ఇది 'దగా రాజ్యం'... మారే జనం, దూరే జనం, చూసే జనం అంతా బానే ఉండగా మధ్యలో అర్థ రాత్రి స్వాతంత్రం లాగా నీ గోల ఏంటి రాకేషా అనుకోకండి. ఎవరో పిలిచినట్టుగా వచ్చి, మంచి మాటలతో మొదలుపెట్టి మాయ మాటలతో కట్టి పెట్టి, మాటలకీ చేతలకి మాట మాత్రమైనా సంబంధం లేకుండా మరో పార్టీ కి అంకితం అనిపించుకున్న అభిమాన నటుడికి వినిపించేలా, కనిపించేలా కాకపోయినా చుస్తాడేమో అనిపించేలా కొన్ని మాటలు బుల్లిబ్లాగు ద్వారా చెపుదామని భావించే ఇంటర్నెట్ సమాజంలో బ్రతికే ఒక పిచ్చి వోటరు మనసులో మాట!

అందరూ అనుకున్నట్టుగా చిరంజీవి గారు జనాల్ని కొత్తగా మోసం చేసిందేం లేదు. ఇదంతా అసాధారణ రాచకీయ(అచ్చు తప్పుకాదు... సరిగ్గానే పడింది) చరిత్రలో ఎప్పుడూ ఉన్న భాగోతమే. ఆయన చేసిన పనికి కాస్త కోపమొచ్చినా ప్రస్తుతం ఆయన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. పదేళ్లుగా రాజకీయ ప్రవేశానికై ఎన్నో వదంతులు వస్తున్నా అసలు చలించని చిరంజీవి గారు తెలుగు నాట రాజకీయ సంక్షోభం కనుచూపు మేరలో ఉంటుండగానే రంగప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

వెండి తెరకి మకుటం లేని మహారాజు, అన్న గారి(మీరు అక్షరాలా కరెక్టు... స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే) తర్వాత అంతటి జనాభిమానం ఉన్న నటుడు అయిన చిరంజీవి గారికి రాజకీయాల్లో నటనా వంటబట్టలేదు.... సంభాషణలు పలకటము చేత కాలేదు.... ఎత్తుగడలు తెలిసి రాలేదు. జనాల్ని మోసం చేయటానికి ఆయనేం గెలిచిన నాయకుడు కాదు... సొంత నిర్ణయాల చేతిలో చావు దెబ్బ తిని మూలన పడ్డ పిరికి(క్షమించాలి...) నేత. లెక్కపెట్టుకుంటూ పోతే పార్టీ ప్రకటించిన తర్వాత ప్రజల అభిమానం పోగొట్టుకునే క్రమంలో ఆయన వేసిన తప్పటడుగులు, తిన్న దెబ్బలు ఎన్నో మరెన్నో.... అందులో నేను లెక్క పెట్టిన కొన్ని ఇదిగో ఇక్కడ రాస్తున్నా....

1
. పార్టీ వ్యవహారాలలో తన సొంత వాళ్ళనే కానీ ఇన్నేళ్ళుగా సొంత మనిషిలా ఆదరిస్తున్న అభిమానులకు కాస్తైనా అవకాశం ఇవ్వకపోవటంతోనే వోటు బ్యాంకుకు పెద్ద లోటుని సమకూర్చుకున్నాడు చిరంజీవి
2. ఎన్నో ఉత్తమ భావాలతో నిండిన పార్టీ ఎజెండా కి బలమిచ్చేది మంచి నాయకులు లేదా మంచివారైన మనుషులే కానీ, పక్క పార్టీలలో టికెట్లు రాక అవకాశం కోసమై ప్రజా రాజ్యాన్ని ఆశ్రయించిన వృధా నాయకులు కాదు. అభ్యర్థుల ఎన్నికలో, పక్క పార్టీల వారిని అనుమతించటంలో చిరూ పార్టీ కాస్తైనా పద్ధతి పాటించక పోవటం పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది.
3. ఆఖర్లో టికెట్లకై పెద్ద మొత్తం లో డబ్బులు తిన్నారన్న వార్త ప్రజా రాజ్యం లో మొదటి 'సగానికి' పెద్ద పోటే వేసింది. అసలు పార్టీలో అరవింద్ గారి పాత్రే మొదటనుండి ప్రశ్నార్థకం. ఆఖరికి ఆయన అతి నమ్మకానికి జనాలు తగిన ముగింపే ఇచ్చారు. చిరంజీవిగారు సొంత నియోజక వర్గం లో ఓడిపోవటం కూడా పెద్ద దెబ్బే.
4. ఎలెక్షన్ లో ఓడిన మరుక్షణం వలస నాయకుల దగా పోటు పార్టీ మూలాలనే కదిలించేసింది. అసలు పార్టీ లో ఇంకేమైనా మిగిలి ఉందా అనే ఆలోచన కూడా తెచ్చేసింది. విషయంలో పలు మార్లు తన బాధ విలేఖరుల ముందు వెళ్ళగక్కిన చిరూ గారు తన రాజకీయ ప్రతిభ ఎంత తక్కువో చూపించారు.
5. మొదట్నుండీ తెలంగాణకి అనుకూలం అని చెపుతూనే, నాటకీయ పరిణామాల మధ్య కేంద్రం తెలంగాణా ప్రకటించిన వెంటనే ప్రజా రాజ్యం లోని తెలంగాణేతర ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి తన ఆలోచనే మార్చుకోటం నాయకుడిగా, మాట మీద నిలపడే ప్రజల మనిషిగా ఆయన మీద ఎక్కడో మిగిలున్న కాస్త అభిమానం కూడా పోగొట్టుకున్నాడు.

చివరగా, జగన్ వర్గం చెక్ పెడుతుందని భయపడి తమ చిక్కుని వదిలించునే క్రమంలో చిరుకి ఏవో ఆశలు పెట్టి తమ వైపు లాక్కున్నారు కాంగ్రెస్ పెద్దలు. వారి సమస్య తీరినా పాపం చిరు కొత్త సమస్యలో ఇరుక్కుపోటం కాంగ్రెస్ మార్కు రాజాకీయాలకు అసలు నిదర్శనం. అభిమాన నటుడిగా ఎన్నో ఏళ్లుగా పేరు ప్రతిష్టలు సంపాదించిన గొప్ప నటుడు, మంచి మనసున్న చిరు తన ఆశయ సాధనలో అతి తక్కువ కాలంలో చతికిల పడటం అందరికీ మింగుడు పడని విషయం. ఇంత గొప్ప వ్యక్తి పార్టీ పెడితే రెండే కారణాలుండాలి.... ఒకటి పేరు కోసం, లేక జనం కోసమో. ప్రజా రాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయటంలో ఆయనకీ రెంటిలో ఏదీ సాధించే అవకాశం రాదు. పార్టీ అలానే ఉంచి కాంగ్రెస్ వారికి సపోర్ట్ ఇచ్చినా భవిష్యత్తులో పది-పాతిక టికెట్లతో కష్టపడి ఏదో ఒకనాడు పార్టీ ని గెలిపించే అవకాశం ఉండేదేమో. ఇప్పుడు మహా అయితే ఏదో మంచి పదవి దొరకొచ్చు. అది కూడా వచ్చే ఎలెక్షన్ వరకే. కాంగ్రెస్ పార్టీ లో వృద్ధ, వృధా నాయకులతో పాటు దగా నాయకులకీ కొదవ లేదు. వారందరూ కలిసి కొట్టుకునే క్రమంలో రాజకీయం రాని చిరు ఎంత వరకు నెగ్గుకురాగలడు అనేది ఎంతకీ అంతు చిక్కని ప్రశ్న. మరికొన్నేల్లలో ప్రతిష్ట, రాజకీయ జీవితం రెండూ మరుగున పడించుకునే మెగా స్టార్ చిరంజీవికి, అతి తక్కువ కాలమే అయినా అంతో ఇంతో ప్రయత్నం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ముందు ముందైనా మంచో, రాజకీయమో తెలుసుకొని మళ్లీ అభిమానులని ఆనందింప చేయాలని మనవి చేసుకుంటూ సెలవు.

Friday 24 December, 2010

సినీ సమీక్ష: మన్మధ బాణం

నటీనటవర్గం: కమల్ హాసన్, మాధవన్, త్రిష, సంగీత, రమేష్ అరవింద్, ఊర్వశి, ఉషా ఉతుప్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: సుబ్రహ్మణ్యం బి, రుమేష్ వై
కథ - కథానువాదం: కమల్ హాసన్
మాటలు: వెన్నెలకంటి
దర్శకత్వం: కే.ఎస్. రవి కుమార్
ఫలితం: అంతా అయోమయం!

మూల కథ:
ఒక ధనవంతుడు సినీ నటి అయిన తన ప్రేమికురాలి మీద అనుమానంతో ఒక గూడచారిని నియమిస్తాడు. ఆ పైన వచ్చే సంఘటనల సమాహారమే ఈ కథ.

వివరాలు:
ప్రముఖ సినీ నటి అంబుజాక్షి / నిషా (త్రిష), ధనవంతుడైన మదన్(మాధవన్) ప్రేమికులు. నిషా మీద అనుమానంతో భూషణం(కమల్) అనే గుడచారిని నియమిస్తాడు మదన్. నిషా తన మిత్రురాలైన దీప(సంగీత), ఆమె పిల్లలతో కలిసి ఐరోపా పర్యటనకు వెళ్తుంది. అక్కడ ఆమె గురించి తెలుసుకోటానికి వెంబడిస్తాడు భూషణం. భూషణం కి గతంలో ఒక కథ ఉంటుంది. అలానే ప్రస్తుతంలో కాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్న మిత్రుడి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మదన్ కి నిషా గురించి ఏవో చెప్పి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఆ తర్వాత కథ చెప్పేస్తే ఇంక తెర పైన చూడటానికి ఏమీ మిగలదు.

నటన:
మాధవన్, త్రిష బాగా నటించారు. సంగీత కి చాల రోజులకి పెద్ద పాత్ర దక్కింది. ఆమె బాగా చేసింది. ఊర్వశి, రమేష్ అరవింద్, ఉషా ఉతుప్ అందరు పరిధి మేరకు బాగా నటించారు. ఎప్పటిలానే కమల్ ప్రేక్షకులని మెప్పిస్తాడు, కథంతా తానై నడిపిస్తాడు. పరిధులు లేని కమల్ నటన ఖచ్చితంగా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది.

సాంకేతిక విభాగం:
కథ, కథనం లో కమల్ మార్కు కనపడుతుంది. సున్నితమైన కథ, వీలైనంత హాస్యం జొప్పించే ప్రయత్నం లో సాగుతుంది కథనం. ఒకింతగా బానే చేసారని చెప్పుకోవచ్చు. మాటలు తెలుగులో వెన్నెలకంటి ఐనప్పటికీ పూర్తిగా తమిళంలో కమల్ తో కలిసి రాసిన క్రేజీ మోహన్ మార్కు కనపడుతుంది. కొరియోగ్రఫీ సహజంగా ఉంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. సినిమా ఎక్కువ భాగం జరిగే గ్రీసు, బార్సిలోన, వెనిస్ అందాలను బాగా చూపించారు. కూర్పు కథకి తగినట్టుగా ఉంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటల్లో అంతలా దేవి శ్రీ మార్కు కనపడకపోయినా, ఇలాంటి కథకు సరిపోయినట్టుగానే ఉంటాయి. దర్శకుడిగా కే. ఎస్. రవి కుమార్ మునుపులో కమల్ తో చేసిన హాస్య చిత్రాలకు మల్లే మళ్లీ మెప్పిస్తాడు. ఇది ఆయనకు బాగా అలవాటైన విద్య.
భూషణం గతం అంతా ఒకే పాటలో మొత్తం కథంతా వెనక్కి వెళ్తున్నట్టుగా చూపించే కొత్త ప్రయత్నం చేసారు. అది ఆకట్టుకుంటుంది. ముందు ముందు మనం ఇంకా ఎన్నో సినిమాలలో ఇలాంటి ప్రయత్నం చూసే అవకాశం ఉంది.

చివరి మాట:
కథలో మరీ కొత్తదనమేం ఉండదు. ఈ మధ్య కాలంలో వచ్చిన కమల్, కే.ఎస్. రవి కుమార్ ల తెనాలి, పంచతంత్రం లాంటి హాస్య చిత్రాల మల్లే ఉంటుంది. అందరి నటుల నుండి మంచి నటన, మాటలు, సన్నివేశాల్లోని హాస్యం సినిమాకు బలం. ఆఖరి ఒక గంట బాగా నవ్వించేసారు. ఫక్తు వినోదం కొరకు ఎదురు చూసే వాళ్ళు, కమల్ అభిమానులు మరో ఆలోచన లేకుండా చూడొచ్చు. అలా అని మరీ గొప్ప చిత్రమేం కాదు.

మార్కులు: 3/5

Sunday 18 July, 2010

Happy BirthDay!!

This is for my sweet little sister...
On this Birth Day I wish her happiness and prosperity all through her life :)



My first best friend
My first rival at home
I saw her with envy
As she became the new apple of the eye
The rivalry continued
till i realized that she was the best sister in th
e world
A tiny little thing

My playmate till I discovered cricket
Played all girly games with her

We d
on't say how much we love each other
We speak more through eyes than words
We know that we are always there for each other
Sometimes things unsaid convey more meaning
Touche
d bonds are sweet but those untouched are sweeter
An year age difference

but I was her wall of defense

She became grow as a pillar

But she is to me my little sister

Saturday 5 June, 2010

వేదం

నటీనటవర్గం: అల్లు అర్జున్, మనోజ్ మంచు, అనుష్క, నాగయ్య, మనోజ్ భాజపాయ్, సియా గౌతమ్, రవికాంత్, శరణ్య
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నిర్మాత: ప్రసాద్ దేవినేని, శోభ యార్లగడ్డ
కథ - కథానువాదం -దర్శకత్వం: క్రిష్(రాధాకృష్ణ జాగర్లమూడి)
ఫలితం: చూసి తెలుసుకోండి... మంచి సినిమా

మూల కథ:
ఇది 5 కథల సమాహారం. భిన్న వ్యక్తులు, వారి బాధలు, వాటికి సమకాలీన అంశాలు జోడించి తీసిన సినిమా.

వివరాలు:
గమ్యం అనే ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించిన దర్శకుడు క్రిష్. వ్యాపారపరంగా మంచి లాభాలు రాబడుతూనే అవార్డుల్లోను అధ్బుతంగా రాణించిన సినిమా అది. క్రిష్ ద్వితీయ ప్రయత్నంగా తీసిన చిత్రం 'వేదం'. సినిమా మొదలు పెట్టినప్పటినుండి తెలుగులో మల్టిస్టారర్ చిత్రాలకు తిరిగి నాంది పలుకుతున్న చిత్రంగా అందరిలోనూ ఆత్రుత కలిగించిన సినిమా. పెద్ద తారలున్నా ఖచ్చితంగా ఇది దర్శకుడి సినిమానే అని అందరు నమ్మిన సినిమా. దేశం, రాష్ట్రం, ఊరు, పేరు, కులం, మతం, జాతి, భాష ఇవేవి కావు.. మానవత్వమే ముఖ్యం అని గట్టిగా చాటే సినిమా వేదం. సందేశాత్మక చిత్రమే అయినా ప్రేక్షకులకు నచ్చేలా తీయటంలో సఫలమయ్యాడు దర్శకుడు.
తల్లి మిలిటరీ లో చేరమంటే తను మాత్రం రాక్ బ్యాండ్ పెట్టి ప్రదర్శనలు ఇచ్చే పాత్రలో మనోజ్ నటించాడు. స్వతహాగా ఎవరికీ సహాయం చేసే గుణం ఉండదు. ఎవరో ఒకరు చేస్తార్లే అనుకుంటాడు. ఒక ప్రదర్శన కొరకు బంగళూరు నుండి హైదరాబాద్ బయదీరుటాడు మిత్రులతో కలిసి. సిరిసిల్ల లో చేనేత కార్మికునిగా చేస్తూ చేసిన అప్పు తీర్చలేక దొర తన మనవణ్ణి పనిలోకి లాక్కెల్తే ౩ రోజుల్లో బాకీ తీర్చి మనవణ్ణి బాగా చదివిన్చుకుందాం అని కోడలు శరణ్య తో కలిసి డబ్బు సంపాదించటానికి హైదరాబాద్ బయల్దేరుతాడు నాగయ్య. వినాయక ఉత్సవాల్లో జరిగిన గొడవలో ఏ తప్పు లేకుండా హిందూ భక్తులు, పోలీసుల చేతిలో దెబ్బలు తినటమే కాక అదే గొడవలో భార్య గర్భం కూడా పోగొట్టుకున్న మనోజ్ బాజపాయ్ ఇక్కడ బ్రతకటం ఇష్టం లేక దుబాయ్ వెళ్ళే ప్రయత్నం లో ఉంటాడు. అమలాపురం లో ఒక వేశ్యా గృహం లో పనిచేస్తూ అక్కడనుండి తప్పించుకొని హైదరాబాద్ బయల్దేరుతుంది సరోజ (అనుష్క). ధనవంతురాలైన అమ్మాయిని ప్రేమించి డబ్బులకి ఏవేవో తంటాలు పడే కేబుల్ రాజు పాత్రలో అల్లు అర్జున్ నటించాడు.
వీరందరి జీవితాలు భిన్న పరిస్థితుల ప్రభావం వాళ్ళ బోల్డు మలుపులు తిరిగుతాయ్. ఎలా వీళ్ళ పాత్రలు తమ ఆశయాలవైపు పరిగెడుతూ కష్టాలు పడ్డారో, ఎలాంతో ఆటుపోట్లకు లోనయ్యారో చూడాలంటే వెంటనే వేదం కి వెళ్ళండి.

నటన:
సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, నాగయ్య, మనోజ్ బాజపాయ్, రవికాంత్, శరణ్య, సియా గౌతమ్ వీరెవరు కనపడరు. వారి వారి పాత్రలే కనపడతాయి. అందరు చాలా బాగా చేసారు. ఇమేజ్ చట్రంలో ఉండకుండా దర్శకుడి భావాలకు అనుగుణంగా చేసినందుకు అర్జున్, మనోజ్, అనుష్కలను మెచ్చుకోవాలి. నటుల్లో నాగయ్య, మనోజ్ నన్ను బాగా ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం ఒకే సన్నివేశంలో కన్పించి అందరిని నవ్వించి వెళ్తాడు. రఘుబాబు, పోసాని ల హాస్యం బాగుంది.

సాంకేతిక విభాగం:
కీరవాణి బాణీలు బయట విన్నదానికంటే సినిమాలో ఎక్కువ ఆకట్టుకున్నాయి. అన్ని పాటలు(ఒక్కటి మినహా) కథాగమనంలో భాగంగా వచ్చేవే. నేపథ్య సంగీతం బాగుంది. నిజజీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలు, సన్నివేశాల్ని నిజంగా నిజమే అనిపించేలా చూపించినందుకు చాయాగ్రాహకుడు వి.ఎస్.జ్ఞానశేఖర్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. దర్శకుడు క్రిష్ రెండో సినిమాలో కూడా మంచి మార్కులు కొట్టేస్తాడు. సన్నివేశాల్ని హృదయానికి హత్తుకునేలా తీయగలిగాడు. మంచి భవిష్యత్తు ఉన్న దర్శకుడు.

చివరి మాట:
మంచి నటన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాకు బలం. హాలివుడ్ సినిమాల స్ఫూర్తి కనిపించినా తెలుగుదనం నిండుగా ఉంటుంది. ప్రథమార్థం లో కథని ఇంకాస్త పట్టుగా అల్లుకునుంటే బాగుండేది. మంచి కథ, సందేశాత్మక విలువలు, వాణిజ్య విలువలు కలిపి ఉన్న సినిమా. చూసిన ప్రేక్షకులకు కాసింత కంటతడి పెట్టిస్తూ ఆలోచింపచేసే సినిమా. మనిషికి మనిషి సహాయం చేసుకోటమే మానవధర్మం అని చెప్తుంది 'వేదం'. అందరు ఉహించినట్టుగా, ఎందరో సినీ ప్రముఖులు చెప్పినట్టుగా ఇది చరిత్ర సృష్టించే సినిమా కాకపోవచ్చేమో కానీ మంచి చిత్రం గా అయితే మిగిలిపోతుంది.

మార్కులు: 3.75/5

Rajneeti

Sorry for not being able to update the review last night. Internet was down at my place.

Cast: Ranbeer Kapoor, Nana Patekar, Katrina Kaif, Arjun Rampal, Ajay Devgan, Manoj Bajpayee
Music: Wayne Sharpe
Director: Prakash K Jha
Producer: Prakash K Jha, Ronnie Screwvala
Genre: Drama
Result: More politics.... Less votes!!

Basic Plot:
Modern day Mahabharath incorporated with God Father and present(Fictional though!) day politics.

Details:
Director Prakash Jha with few serious & hard hitting movies like Mrutyu Dand, Gangaajal, Apaharan in his kitty, tried his best to make a movie as bold as Bihar politics which he is very familiar with. Having tried his hand in politics in 2 LokSabha elections, showed much interest in exposing the darkest version of politics. In the process he used Mahabharath, best political drama ever in human history(as per me) as a basic plot. War between brothers, great friendship between Karna and Duryodhana, Karna's birth, Pandu Raj, helpless and bedridden Dhrutaraashtra, Lucky and heroic Arjun, His mentor Lord Krishna and most importantly Bhagavadgita. Creates same environment(minus అరణ్య వాసం and అజ్ఞాత వాసం). What follows is a heavy bloodshed and political drama. Nana Patekar as Brij Gopal in Lord Krishna's role says 'राजनीति में सही या गलत नहीं होते। बस हर काम का कुछ मकसद होते।'। This dialogue sums up the whole thing. Nothing is good or bad. No one is good and no one is bad. What matters is power and everybody works towards that without giving a damn to humanity or sentiments. All actors got meaty roles and got enough chance to show their acting skills. There are as many love making scenes as the number of lead(read as important) ladies in the movie and none of them are convincing. But those scenes play important role in story line. First 1 hour puts the viewer in confusion because director takes time to introduce all characters. After that it takes into the main plot and the drama that follows. Total movie goes in Pandava's perspective which in not convincing. This screenplay technique was used in Mahabhatha too, in order to make them heroes.

Performances:
All actors performed well. Naseeruddin Shah in his very brief role and Nana Patekar with his subtle performance stands tall. Ranbeer Kapoor, Katrina Kaif, Manoj Bajpayee are decent. Arjun Rampal's role can give him much needed boost. There is one foreign girl(Forgot the name :() acted as Ranbir's love interest. She did well too. Ajay Devgan performed well but looks like he is misplaced. Role of Karna did not suit him well.

Technical Departments:
To start with, background score and cinematography are flawless. Adds lot of value to the movie. Only one song that too comes as a background version and serves the purpose properly. UTV motion pictures is a big production company. They have a good reputation for making movies in uncompromising manner and they prove it yet again. Director Prakash jha succeeded in combining Mahabharath, God Father and modern day politics but that's not enough. Pace of the movie is big hurdle. Length of the movie is adequate considering the number of characters and plots in the movie.

Conclusion:
Personally I am not totally satisfied with this movie, not even disappointed. This is not totally engaging, gripping, entertaining,
thought provoking or commercial / art cinema. It has a bold theme, some nice scenes and honest performances. Might be a grosser at box office due to big star cast, huge advertising, grand extravaganza but
could not sustain my attention for 3 hours. Better screenplay would have done wonders.

My Rating: 2.75 / 5

Friday 28 May, 2010

Fatafat Review - Golimaar

One down in my movie list....

Cast: GopiChand, Priyamani, Nasser, Roja, Shawar Ali, Kelly Dorji
Music: Chakri
Producer: Bellamkonda Suresh
Story - Screenplay - Dialogues - Direction: Puri Jagannath

Puri Jagannath and Gopichand's 'Golimaar', based on Mumbai encounter specialist DayaNayak's life is decent watch. Nothing new to offer though(Mixed bag of concepts n scenes in Puri's old movies).... Puri succeeded in presenting the age old cop concept in entertaining way. May find coincidences with Ramu N Shimit Amin's Ab tak Chappan and Gautam Menon's Kaaka Kaaka(Tamil) and Gharshana(Telugu) but the presentation is different from the originals.

Everybody contributed well(both on screen N off screen). Puri's dialogues makes the movie must watch. Few dialogues in climax, pre interval and some important scenes are really awesome.... Trademark puri style.

Chakri's music may not be a table topper but contributes well to the requirements of movie. Background score is decent.

Gopichand N Priyamani are best fit for their roles. Loved Priyamani's own dubbing voice. Roja came up with sterling performance after a long gap(Saw her in recently released 'Shambho Shiva Shambho' also produced by BellamKonda Suresh. Performance in stands out).

Cinematography and other technical aspects are good and it's a technically well made movie. We need to appreciate producer for that.

Will become a box office hit. Go watch it in leisure!

Rating: 7 out of 10

More to go..... Vedam, Rajneeti coming up next week.
Raavan, Raktha Charitra in June!!