Everything you read here is just a depiction of my thoughts on different topics/issues. You can agree,disagree,fight,suggest,improvise. But I beg you to use your brain before writing something here. If you like my blog then have fun. If you don't like my blog... no problem.... I know you are wise enough to invest your time on something else which is useful to you.
Sunday, 6 February 2011
ఇదేం రాజ్యం???????
అందరూ అనుకున్నట్టుగా చిరంజీవి గారు జనాల్ని కొత్తగా మోసం చేసిందేం లేదు. ఇదంతా అసాధారణ రాచకీయ(అచ్చు తప్పుకాదు... సరిగ్గానే పడింది) చరిత్రలో ఎప్పుడూ ఉన్న భాగోతమే. ఆయన చేసిన పనికి కాస్త కోపమొచ్చినా ప్రస్తుతం ఆయన్ని చూస్తుంటే నవ్వొస్తుంది. పదేళ్లుగా రాజకీయ ప్రవేశానికై ఎన్నో వదంతులు వస్తున్నా అసలు చలించని చిరంజీవి గారు తెలుగు నాట రాజకీయ సంక్షోభం కనుచూపు మేరలో ఉంటుండగానే రంగప్రవేశానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
వెండి తెరకి మకుటం లేని మహారాజు, అన్న గారి(మీరు అక్షరాలా కరెక్టు... స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే) తర్వాత అంతటి జనాభిమానం ఉన్న నటుడు అయిన చిరంజీవి గారికి రాజకీయాల్లో నటనా వంటబట్టలేదు.... సంభాషణలు పలకటము చేత కాలేదు.... ఆ ఎత్తుగడలు తెలిసి రాలేదు. జనాల్ని మోసం చేయటానికి ఆయనేం గెలిచిన నాయకుడు కాదు... సొంత నిర్ణయాల చేతిలో చావు దెబ్బ తిని మూలన పడ్డ పిరికి(క్షమించాలి...) నేత. లెక్కపెట్టుకుంటూ పోతే పార్టీ ప్రకటించిన తర్వాత ప్రజల అభిమానం పోగొట్టుకునే క్రమంలో ఆయన వేసిన తప్పటడుగులు, తిన్న దెబ్బలు ఎన్నో మరెన్నో.... అందులో నేను లెక్క పెట్టిన కొన్ని ఇదిగో ఇక్కడ రాస్తున్నా....
1. పార్టీ వ్యవహారాలలో తన సొంత వాళ్ళనే కానీ ఇన్నేళ్ళుగా సొంత మనిషిలా ఆదరిస్తున్న అభిమానులకు కాస్తైనా అవకాశం ఇవ్వకపోవటంతోనే వోటు బ్యాంకుకు పెద్ద లోటుని సమకూర్చుకున్నాడు చిరంజీవి
2. ఎన్నో ఉత్తమ భావాలతో నిండిన పార్టీ ఎజెండా కి బలమిచ్చేది మంచి నాయకులు లేదా మంచివారైన మనుషులే కానీ, పక్క పార్టీలలో టికెట్లు రాక అవకాశం కోసమై ప్రజా రాజ్యాన్ని ఆశ్రయించిన వృధా నాయకులు కాదు. అభ్యర్థుల ఎన్నికలో, పక్క పార్టీల వారిని అనుమతించటంలో చిరూ పార్టీ కాస్తైనా పద్ధతి పాటించక పోవటం పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది.
3. ఆఖర్లో టికెట్లకై పెద్ద మొత్తం లో డబ్బులు తిన్నారన్న వార్త ప్రజా రాజ్యం లో మొదటి 'సగానికి' పెద్ద పోటే వేసింది. అసలు పార్టీలో అరవింద్ గారి పాత్రే మొదటనుండి ప్రశ్నార్థకం. ఆఖరికి ఆయన అతి నమ్మకానికి జనాలు తగిన ముగింపే ఇచ్చారు. చిరంజీవిగారు సొంత నియోజక వర్గం లో ఓడిపోవటం కూడా పెద్ద దెబ్బే.
4. ఎలెక్షన్ లో ఓడిన మరుక్షణం వలస నాయకుల దగా పోటు పార్టీ మూలాలనే కదిలించేసింది. అసలు పార్టీ లో ఇంకేమైనా మిగిలి ఉందా అనే ఆలోచన కూడా తెచ్చేసింది. ఈ విషయంలో పలు మార్లు తన బాధ విలేఖరుల ముందు వెళ్ళగక్కిన చిరూ గారు తన రాజకీయ ప్రతిభ ఎంత తక్కువో చూపించారు.
5. మొదట్నుండీ తెలంగాణకి అనుకూలం అని చెపుతూనే, నాటకీయ పరిణామాల మధ్య కేంద్రం తెలంగాణా ప్రకటించిన వెంటనే ప్రజా రాజ్యం లోని తెలంగాణేతర ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి తన ఆలోచనే మార్చుకోటం నాయకుడిగా, మాట మీద నిలపడే ప్రజల మనిషిగా ఆయన మీద ఎక్కడో మిగిలున్న ఆ కాస్త అభిమానం కూడా పోగొట్టుకున్నాడు.
చివరగా, జగన్ వర్గం చెక్ పెడుతుందని భయపడి తమ చిక్కుని వదిలించునే క్రమంలో చిరుకి ఏవో ఆశలు పెట్టి తమ వైపు లాక్కున్నారు కాంగ్రెస్ పెద్దలు. వారి సమస్య తీరినా పాపం చిరు కొత్త సమస్యలో ఇరుక్కుపోటం కాంగ్రెస్ మార్కు రాజాకీయాలకు అసలు నిదర్శనం. అభిమాన నటుడిగా ఎన్నో ఏళ్లుగా పేరు ప్రతిష్టలు సంపాదించిన గొప్ప నటుడు, మంచి మనసున్న చిరు తన ఆశయ సాధనలో అతి తక్కువ కాలంలో చతికిల పడటం అందరికీ మింగుడు పడని విషయం. ఇంత గొప్ప వ్యక్తి పార్టీ పెడితే రెండే కారణాలుండాలి.... ఒకటి పేరు కోసం, లేక జనం కోసమో. ప్రజా రాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేయటంలో ఆయనకీ ఈ రెంటిలో ఏదీ సాధించే అవకాశం రాదు. పార్టీ అలానే ఉంచి కాంగ్రెస్ వారికి సపోర్ట్ ఇచ్చినా భవిష్యత్తులో పది-పాతిక టికెట్లతో కష్టపడి ఏదో ఒకనాడు పార్టీ ని గెలిపించే అవకాశం ఉండేదేమో. ఇప్పుడు మహా అయితే ఏదో మంచి పదవి దొరకొచ్చు. అది కూడా వచ్చే ఎలెక్షన్ల వరకే. కాంగ్రెస్ పార్టీ లో వృద్ధ, వృధా నాయకులతో పాటు దగా నాయకులకీ కొదవ లేదు. వారందరూ కలిసి కొట్టుకునే క్రమంలో రాజకీయం రాని చిరు ఎంత వరకు నెగ్గుకురాగలడు అనేది ఎంతకీ అంతు చిక్కని ప్రశ్న. మరికొన్నేల్లలో ప్రతిష్ట, రాజకీయ జీవితం రెండూ మరుగున పడించుకునే మెగా స్టార్ చిరంజీవికి, అతి తక్కువ కాలమే అయినా అంతో ఇంతో ప్రయత్నం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ... ముందు ముందైనా మంచో, రాజకీయమో తెలుసుకొని మళ్లీ అభిమానులని ఆనందింప చేయాలని మనవి చేసుకుంటూ సెలవు.
Thursday, 24 December 2009
వందేమాతరం
ఇది ఆరని రావణ కాష్ఠం.... చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం..... ఇక ఆగని సమరంలో
ఈ నేరం... ఇక దూరం..... ఇది మా తరం
వందేమాతరం...... వందేమాతరం!!
చిన్నప్పుడెప్పుడో చదివా రెండు పిల్లులు కొట్టుకుంటే ఇంకేదో వచ్చి ఉన్నదంతా గుటుక్కుమనిపించిందని!! అలాతయారయ్యింది ఈ రాష్ట్రం పరిస్థితి.
పొద్దునలేస్తే బంద్ లు.... ఏం జరిగినా విధ్వంసాలు.... ఏవో కారణాలు చూపించి మన ఆస్తులు మనం దగ్ధం చేసుకోటం..... తెలంగాణా కాదు.... సమైక్యాంద్రా కాదు..... ముందు కాస్త మనశ్శాంతిని ఇవ్వండి చాలు........
Thursday, 10 December 2009
రాజకీయ తెలం'గానం'
జాతీయ నాయకత్వం నుండి వచ్చిన సందేశాలకు ఆనందడోలికల్లో తేలియాడుతున్న తెలంగాణా ప్రజలకు నాదొక చిన్నప్రశ్న... ఇదేనా మనం కోరుకుంది? అన్నీ కుదిరాయనుకొని ఇక మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చా? నన్నడిగితే కాదనేచెప్తాను. 5 ఏళ్ల క్రితం తెలంగాణా నినాదంతో అభికారంలోకి వచ్చి, సెకండ్ ఎస్సార్సీ అనే పేరుతో ఎంత నాన్చాలో అంత నాన్చి అసలు ఆ ఉద్యమాన్నే తెరమరుగుచేసినంత పని చేసిన కాంగ్రెస్ నాయకుల మాటలు అంత గొప్పవా? వారిచ్చినమాటలో లొసుగులు ఏమి లేవా? తెలంగాణా ఇంక వచ్చేసినట్టేనా?
అసలు ప్రత్యేక రాష్ట్రం గురించి తీర్మానం రాష్ట్ర అసెంబ్లీ లో పెట్టాలన్న ఉద్దేశం ఎంత వరకు సమంజసం? రాష్ట్రనియోజకవర్గాల్లో సగం శాతం కూడా లేని తెలంగాణా గురించి అసెంబ్లీ లో మూడింట రెండొంతుల ఎం.ఎల్.ఎ. ల ఆమోదంపొందటం సాధ్యమేనా? ఇక్కడింకో సమస్య ఉంది. హైదరాబాద్ గురించి స్పష్టమైన ప్రకటనే లేదు. హైదరాబాదు కూడాతెలంగాణా రాష్ట్రంలో వస్తుందంటే నాకు తెలిసి కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రజలు ఎవరూ ఒప్పుకోరు. ఇక హైదరాబాదు లేకుండా ఇస్తామంటే తెలంగాణా వారే ఒప్పుకోరు. అయినా తెలంగాణా జిల్లాల మధ్యలో ఉన్నా హైదరాబాదు ని వేరే గా పెట్టి రాష్ట్రం ఇవ్వటం ఎంత వరకు సమంజసం? మధ్యలో చిల్లు పెట్టి ఇవ్వటానికి ఇదేం వడ కాదు.... ఒక రాష్ట్రం. అందుకే అధిష్టానం హైదరాబాదు గురించి స్పష్టంగా చెప్పకపోవటంతో ప్రతి ఒక్కరు తమకు అనుగుణమైన పద్ధతిలోఉహించుకుంటున్నారు. అసలు ఇంకా హైదరాబాదు అంశం గురించి చర్చ మొదలవకముందే సమైక్యాంద్ర వాదులు తమగళం వినిపించటం మొదలు పెట్టేసారు. రాజీనామాల పర్వం మొదలైపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ లోనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. గారి మరణం తర్వాత అంతర్గతంగా, బహిరంగంగా ఎన్నో గొడవలు, కుమ్ములాటలు జరిగాయి. మరి వారిలో ఎవరైనా దీన్ని అవకాశంగా వాడుకోవటం జరుగుతుందా? అసలు రోశయ్య గారి ప్రభుత్వం నిలబడుతుందా? ఇదే జరిగితే తెలంగాణా అంశం మరొక్కసారి మూలన పడే ప్రమాదం ఉంది. ఇవేం జరగకుండా రాష్ట్రఅసెంబ్లీ లో తీర్మానం పెడితే నాకు తెలిసిన లెక్కల ప్రకారం తెలంగాణాకు కావాల్సిన మద్దతు లభించటం కష్టమే. అదేజరిగితే ప్రత్యేక తెలంగాణా జనాల అభీష్టం కాదు అని చెప్పేసి చేతులు దులుపుకోవచ్చు ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ గొడవ చేస్తామని తెలంగాణావాదులు సర్దిచెప్పుకున్నా ఒక్క సారి ఆగిన ఉద్యమం మళ్లీ ఊపందుకోవాలంటే కష్టమే. ఆవేశంలో తెలంగాణావాదులు పెద్ద గొడవలు చేసినా తట్టుకోవటం కష్టమే. ఎటు వెళ్తోంది తెలంగాణా ఉద్యమం?
తెలంగాణా ఉద్యమం ఈ నాటిది కాదనే విషయం అందరికి తెలుసు. ఇక్కడ అభివృద్దికై ఎన్నో ఏళ్లుగా చాలా మంది పోరాడుతూనే ఉన్నారు. కానీ ఆ ఉద్యమానికి రాజకీయం రంగు పులమటంతోనే కావాల్సిన గుర్తింపు, ప్రత్యేకత వచ్చింది. గడిచిన 8 ఏళ్లలో తెలంగాణా పేరుతో పుట్టుకొచ్చిన పార్టీలకు అంతే లేదు. వారందరూ ఉనికిని కాపాడుకోవటం కోసం పడ్డపాట్లు, తప్పిన మాటలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణా ప్రజల శ్రేయస్సే తమ ఆశయం అని చెప్పుకున్న వాళ్ళలో ఎంతమంది ఇప్పుడు జరిగిన ఉద్యమంలో పార్టీలకతీతంగా కలిసి పోరాడారు? సమాధానం అందరికి తెలుసు. అసలు వీరంతా ప్రజల శ్రేయస్సు కొరకు వచ్చిన వారేనా లేక రాజకీయ శ్రేయస్సు కోసం వచ్చిన వారా? తెలంగాణా వచ్చినంత మాత్రాన సమస్యలన్నీ తీరిపోతాయా? అభివృద్ధి వచ్చేస్తుందా?
గడిచిన ఎన్నో ఏళ్లలో సౌరాష్ట్ర, ఉత్తరాంచల్, జార్ఖండ్ అంటూ బోల్డన్ని కొత్త రాష్ట్రాలను చూసాం. వీటిలో ఏవీ అనుకున్నంతగా అభివృద్ది చెందకపోగా ఉన్న దరిద్రాలు సరిపోనట్టు మరెన్నో కొత్త స్కాంలకు వేదికలయ్యాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణా కి కూడా అదే గతి పట్టదని నమ్మకమేంటి? తెలంగాణా కోసం ఇప్పుడు పోరాడుతున్న రాజకీయ నాయకుల గత చరిత్రలు అందరికీ తెలిసినవే. చూస్తూ చూస్తూ వీళ్ళనెలా నమ్మటం? వోట్ల కోసం వట్టి మాటలు ఎన్నో చెప్పి అధికారం కోసం ఆ మాటలను ఎన్ని సార్లైనా తప్పటానికి వెనకాడని వీరి మొహం చూసా మనం ప్రశాంతంగా ఉండేది? అసలు తెలంగాణా కావాలా వద్దా అని అడగాల్సింది అన్నీ ఉండి అధికారాలు వెలగబెడుతున్న ఈ రాజకీయ నాయకులనా లేక ప్రత్యెక తెలంగాణా కోసమో లేక దానికి అతీతంగా వస్తుందని నమ్ముతున్న అభివృద్ది కోసమో ఎదురు చూస్తున్న సామాన్య ప్రజలనా? ఎవరికొరకీ తెలంగానం? అధికారం కోసం పాకులాడే రాజకీయ నాయకుల కోసమా, సరిగ్గా దీనివల్ల ఉన్న ఉపయోగాలు తెలీకుండానే ఆవేశంలో గొడవలు చేసి చదువు పక్కన పెట్టి బంద్ లు ర్యాలీలు చేసే విద్యార్థులు కోసమా, ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకునే రైతన్న కోసమా? ఎవరికోసమీ తెలంగానం? ఒక్క సారైనా ప్రజల అభిప్రాయం అడిగారా? టివి లో కనపడే ప్రజలే తెలంగాణా అనుకుంటే ఇంక తెలంగాణా వచ్చినా ఉండే ప్రయోజనం ఏమీ లేదు. తెలంగాణా లో అభివృద్ది లేకపోవటంతో ఆర్థికం గా వెనకపడ్డ సామాన్యుడు గట్టిగా గళం విప్పి అరవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారినడగండి ఎందుకు కావాలో తెలంగాణా. పార్టీ లు కూడా తెలంగాణా మీద పార్టీ పరమైన అభిప్రాయం చెప్పటం ఎంతవరకు సమంజసం? వారు కూడా పార్టీ లో ఉన్న అందరి అభిప్రాయాలకు విలువిచ్చి ఆ తర్వాత తమ అభిప్రాయం చెప్పాలి. అంతే కాని ఉద్యమం వేడి చూసో, రాజకీయ ప్రయోజనాలు చూసో కాదు. ఈ ఉద్యమం ఇప్పుడు ఎన్నో కీలక మలుపులు తిరిగి చివరగా ఎటు వెళ్తుందో ఎవరికీ తెలీదు. అభివృద్ది ముఖ్యం కానీ ప్రత్యేక రాష్ట్రమో మరేదో కాదు. ఆలోచించండి, సమస్యను అర్థం చేసుకొని అభిప్రాయానికి రండి. అంతే కాని అసలు సమస్య మీద అవగాహన లేకుండా ఎవరికీ తోచినట్టు వారు మాట్లాడటం, చెయ్యటం సమంజసం కాదు.
ఇది చూడుము
దేశంలో ఏం జరిగినా ముందు బాధపడేది సామాన్యుడైతే, ఆ వెనక బాధపడేది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థగా పేరుపొంది ఎంత సేవ చేసినా తగిన గుర్తింపు, కావాల్సిన లాభాలు సమకూర్చుకోలేకపోతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఎవడికి బాధొచ్చినా పగిలేది బస్సద్దమే..... ఎవడు చచ్చినా కాలేది బస్సే. ఎంత సేవ చేసినా ఆఖరికి మిగిలేది బూడిదే. చూద్దాం ఇంకా ఎన్ని బస్సులు తగలబడ్తాయో ఈ ఉద్యమధాటికి. అవసరమొస్తే బస్సెక్కుతాం. సమయానికి రాకపోతే బుసలుకక్కుతాం. అన్నీ అయ్యాక తగలబెడ్తాం. నోరు తెరిచి న్యాయమడిగే ప్రజలకే లేని న్యాయం ఇనుపముక్కల సాక్షిగా మండే ధరలనీ, పెరిగే జనాభానీ అదేదో కథలో గాడిదలా మోస్తున్న ఈ మూగజీవానికి ఎప్పుడు వస్తుందంటే చెప్పటం ఆ బ్రహ్మ కి కూడా సాధ్యం కాదేమో!!
Thursday, 3 September 2009
Hearty Condolences to YSR(1949-2009)

I feel sorry for the death of chief minister of Andhra Pradesh Mr. Y S Rajashekhar Reddy. It is so unfortunate to see a great person die like this. May his soul rest in peace. His work as chief minister and opposition leader of Andhra pradesh was very commendable.
I was 7 when Rajiv Gandhi died in human bomb attack. YSR, being a great follower of Rajiv Gandhi did his best to develope our state. After Rajiv Gandhi's death this is the most unfortunate death in Indian political history.
Keeping aside parties, allegations and politics surely Andhra Pradesh people lost a great chief minister. My hearty condolences to the great man.
My sincere condolences to other 4 people who were traveling with YSR when the plane met with that horrible accident. May their souls rest in peace.
Thursday, 23 July 2009
Poetry
Not just a drop of ink
(Moved by the patriotic feelings of Kumarendra Mallick in his posting Not just a drop of blood in www.museindia.com, I wish to add a few more lines..)
It is not just a drop of ink
On your left-hand finger,
It is a ray of hope
to motivate us for a better nation to work even harder.
It is not just a drop of ink
On your left-hand finger,
It is a symbol of pride
Which we can show to others in our bold stride
It is not just a drop of ink
On your left-hand finger,
It is peace as a weapon
Used to clean up the politics that is getting rotten.
Thursday, 26 March 2009
Jaago Re
- Dr. Jayaparakash Narayan
Youth in Politics - Yuva
Democracy is a process by which people are free to choose the man who will get the blame.
Monday, 9 February 2009
అ'సత్యం'
ఒక వ్యక్తి తన గొప్పతనం నిరూపించుకోవటానికి జీవిత కాలం సరిపోదేమో కాని అది పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం చాలు.
నమ్మే వాళ్లు నమ్మినంత కాలం నమ్మించినవన్ని నిజాలవుతాయనుకుంటే ఒక రోజు మనను ఎవరు నమ్మని రోజు వస్తుంది.
రామలింగ రాజు.......
ఇరవై ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో ఐ.టి. ప్రగతికి, పురోగతికి తనవంతు సాయం చేసిన వ్యక్తి. బంగళూరులో ఉన్న ఐ.టి. సామ్రాజ్యాన్ని హైదరాబాదు వరకు విస్తరించటానికి దోహదపడిన వ్యక్తి. ప్రభుత్వ సహకారంతో 108 రూపంలో ప్రజలకు సేవలందించటం, బైర్రాజు ఫౌండేషన్, సత్యం అనే పేరుతో వేలాది ఉద్యోగులకు ఉపాధి కల్పించటం....... ఇలా చెప్పుకుంటూపోతే ఆయన చేసిన మంచి పనుల చిట్టా చాలా పెద్దదే.
ఇన్నేళ్ళుగా పేరులోని రాజునే మకుటంలా ధరిస్తూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి, ఒక్క క్షణంలో అన్నీ పోగొట్టుకొనిఇప్పుడు అదే ప్రజలందరి చేతా మోసగాడు, దొంగ అనిపించుకుంటున్నాడు. ఎలా జరిగిందిదంతా?
ఒక్క అబద్ధం, తాను తన సౌలభ్యం కొరకు సృష్టించిన ఒక్క అబద్ధం ఇంతితై - వటుడింతై అన్నట్టుగా పెరిగి పెద్దదై తిమింగలంలా మారి తిరిగి తననే మింగేసింది. ఒక్క తప్పుకి ఇంత పెద్ద శిక్షా? అవును.... తప్పు ఎలాంటిదైనా శిక్ష మాత్రం జీవితాంతం గుర్తుంచుకునేలా ఉంటుంది. చివరకు దొంగ దొరికాడు. అసలు ఆయనను పట్టుకునే తెగువ ఎవరికుంది? ఇన్ని ఏళ్లుగా ఆయన మాటలతోనే కాక చూపులతోనూ చేస్తున్న మోసాన్ని గమనించటం ఎవరి తరం కాలేదు. మైటాస్ కుంభకోణం తర్వాత చేసేదేమీ లేక ఆయనే తప్పు ఒప్పుకున్నారు. చేసిన తప్పు, దాని పర్యవసానాలు అన్నీ వ్రాతపూర్వకంగా రాసి సంతకం పెట్టి ప్రజల ముందు ఉంచాడు. అందరూ చదివారు. అందులో ఉన్న విషయాలన్నీ నిజమే అని నమ్మారు. ఒక్క విషయం తప్ప.... "సత్యం కొరకు చేయగలిగినంతా చేశాను. కంపెనీ కొరకు నా సొంత డబ్బులుపెట్టానే కాని ఎన్నడూ కంపెనీ డబ్బులు నా స్వప్రయోజనాలకు వాడుకోలేదు." ఈ ఒక్క మాట ఎవరూ నమ్మలేదు.
కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగనేరవు.
మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ.
ఎప్పుడైతే ఆయన చేసింది తప్పని తెలిసిందో, వెంటనే ఆయన చేసినవన్నీ తప్పులే అనే అభిప్రాయానికి వచ్చారు జనం. పోలీసులు రాజు గారిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.
ఇక్కడే మొదలైంది అసలు కథంతా. రాజు కథని యెవరికి అవసరమున్నట్టుగా వాళ్లు వాడుకోవటం మొదలు పెట్టారు.
మణిరత్నం "ఇద్దరు" సినిమాలో ప్రకాష్ రాజ్ తో అంటాడు మోహన్ లాల్ "రాజకీయం.... మట్టి గడ్డలు" అని. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తాడు. అది కథ(వాస్తవం కూడానూ).
మరి మన రాజు కథకీ, మట్టి గడ్డలకి సంబంధం ఏంటి? మట్టిని మాణిక్యం చేయటం ఏ మహానుభావిడికి కూడా వల్ల కానిపని. కాని అదే మట్టిని చూపించి మాణిక్యం అని భ్రమింపచేయటంలో దిట్టలు మన రాజకీయ నాయకులు. రాజు కథని అన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా (ప్రత్యర్థులకు ప్రతికూలంగా) మార్చుకునే ప్రయత్నాలు చేసాయి. రాజుతో కలిసి ఉన్న ఫోటోలు చూపించి, ఆయనతో కలిసి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ప్రస్తావించి ఒకరిపై ఒకరు బురదజల్లుకోవటం మొదలు పెట్టారు. అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.... ఆయన గత పదిహేను సంవత్సరాలుగాపార్టీలకతీతంగా ప్రభుత్వంతో కలిసి ఎన్నో మంచి పనులు, ముఖ్యమైన పనులు చేసారు. ఒక్క విషయంలో తప్పు చేసాడని ఆయన చేసిన పనులన్నీ తప్పులనటం మీ మూర్ఖత్వం. మీ స్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి చెత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించి ఇప్పటికే దిగజారి ఉన్న రాజకీయాలను మరింత భ్రష్టు పట్టించొద్దు.
ఇక పోతే మీడియా వారు ప్రజల మెప్పు కొరకు రాజు పైనా, సత్యం కంపెనీ పైనా జోకులు విసరటం సర్వసాధారణమైపోయింది. మీరు వేసే ప్రతీ జోకు ఎందరో సత్యం ఉద్యోగుల మనసుల్ని బాధింపజేస్తుందన్న విషయం మరవొద్దు. పక్క వాడి బాధతో హాస్యమాడి మానవాతా విలువల్ని దిగజార్చొద్దు. అలా చేస్తే తాడిని తన్నే వాడికి తలదన్నేవాడొకడు ఉంటాడనే విషయం మీకు కూడా ఏదో ఒక రోజు బోధపడుతుంది. అప్పుడు బాధ పడటం మినహా చేయగలిగిందేముండదు. నేనేమీ రాజుని హీరోని చేయట్లేదు. ఆయన చేసింది ముమ్మాటికీ తప్పే. దానికి శిక్ష ఇప్పటికే అనుభవిస్తున్నాడు. అసత్యం అవసరానికి అక్కరకొచ్చినా, ఆ తర్వాత అందరినీ నట్టేట ముంచుతుందనే విషయం రాజుకి ఈ పాటికే అర్థం ఐపోయుంటుంది.
చివరగా భారత దేశ స్వాతంత్రోద్యమంలో గాంధి గారి పాత్ర ఉన్నట్టే, ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు గారి పాత్రఉన్నట్టే, ఐ.టి. పరిశ్రమ హైదరాబాదులో విస్తరించటంలో రాజు గారి పాత్ర కూడా ఉంది అన్నది వాస్తవం. కనీసం ఆయన చేసిన మంచిని దృష్టిలో ఉంచుకొని ఐనా ఆయనని ప్రతీ విషయంలో తప్పు గా చిత్రీకరించటం మానండి. ఆయన కలల కంపెనీ సత్యంని చిన్న చూపు చూడటం మానండి.
ఇట్లు,
ఒక మనిషి.
Monday, 26 January 2009
Happy Republic Day
"Bharat ke Besharam Bachcho Aaj agar Valentines/Friendship day hota to ab tak 100 sms aagaye hote. Behave like a good Indian & wish Happy Republic Day like me".
Very interesting observation :)
It doesn't matter whether you wish others on Republic day or not. What matters most is what you did on that day. Are you really behaving like a true Indian as per the constitution?
Don't worry... I am not going to start the same do good lesson again.
Happy Republic day to you all.
Urs,
Indian
Wednesday, 21 January 2009
Arise-Awake
It took 2 years for me to implement my idea of starting a blog. So there must be some strong reason/topic which forced me to write all of a sudden.
The title looks like a serious one... Yes, you are right. It is a serious topic. If you are looking for an entertaining post, then you don't need to read the next few lines. You can just visit some other blog and enjoy.
Yesterday night after watching Barack Obama's Acceptance speech in TV, my room-mate started asking me some questions on the speech. Obama said that he'll try his best to save America from the crisis situation they are facing today. My room-mates asked me, Do you think americans are really in a crisis situation? If you think so What is the reason?
This is a very interesting queston and I started explaining him about the circumstances and issues which forced the so called richest and powerful nation to fall into this big trap.... "Economic Crisis". We discussed about it for a quite long time. I told him about the role of banks in getting to this situation. How their over enthusiasm and unplanned behaviour affected the economy of America. Then out of no where we got a word called corruption. The word which came to my mind when I saw the movie Bharatheeyudu(By Kamal Hassan and Shankar) for the first time on big screen. I know it has nothing to do with present America's stuation but we started discussing on that topic. So this guy became very emotional and wanted to stop corruption in India.
Almost every Indian says the same thing... I want to stop corruption in India. But how? Nobody even dare to think of that question. Because they strongly believe it won't work without even thinking of something. Typical Indian mentality. When you ask them why can't they stop it, They'll tell you so many reasons.
Here comes the reasons:
1) There is no proper political system.
2) Politicians are corrupt.
3) We can't do anything without giving bribe(May be they are referring to the way our government offices work).
4) It's waste of time(I know time is valuable than money).
5) Why only me?(First ask all others to change)
and so on.......
You'll get an infinite number of reasons and the end result is same.
I want everybody to be perfect except me. Then what the hell am I doing here? Blame others for my mistakes. I don't even try to change myself and I want all others to be perfect. Am I expecting too much from this world? These are the things we need to think.
Here I want to confirm one thing.... All through my life I tried my best to stop corruption. Whether you believe me or not, it doesn't matter to me. And I don't want to drill too much into my past. Today I promise to myself that I won't encourage corruption. I am not talking about trying my best, I want to implement with perfection.... 100%. Under any circumstances and even if it cause me big loss/damage. At least I get the satisfaction that I am not into it. And I am not giving a chance to others to expect something from my side. Now the big Question. Why am I writing all these things in a blog? I can just keep it in my mind and start implementing it or I can write it in my personal dairy. The reason is I feel happy if at least one more person gets influenced by this idea. And the other reason is people say that If you want to stop smoking, tell that to at least 4 people. Whenever you try to break your promise, these 4 people will make you feel guilty. So I am using the same logic here.
My only request is not to make a comedy of this issue and my decision. You can continue with your own priorities. But don't blame others unnecessarily. If you want to see some change in society then start it with you.
(Ardha raatri thinnadi arakka veededo thokkalo decision teeskunte idantha manaku cheppala ani evaraina anukunte Iam sorry)
Most of the times we don't even know that it's corruption. Because in all these years we are tuned to some things which are not correct and our mind says that there is nothing wrong in doing such things. Think twice before you do something which involves money.
Urs,
Rock