Tuesday, 27 April 2010

జీవితం - ఒక కల

ఎన్ని మజిలీలో జీవితంలో.... తెలిసి కొన్ని... తెలీక మరిన్ని....
మురిపిస్తాయి... మరిపిస్తాయి... కవ్విస్తాయి.... బాధిస్తాయి.....
చూస్తుంటే కలలా అనిపిస్తాయి.... చూస్తుండగానే కలగా మిగిలిపోతాయి!!

ఏముంది శాశ్వతం ప్రపంచంలో....
భూమి, ఆకాశం,
చీకటి, వెలుగు,
మంచి, చెడు,
మనుషులు, మనసులు,
దేహం
ఏదీ శాశ్వతం కాదు.

పుట్టుక ఒక వింత... చావు కూడా వింతే...
ఎందుకొచ్చామో.... ఎందుకు వెళ్తామో...
చెప్పాల్సిన దేవుడేమో కంటికి కనపడడు!
అంతా మాయ లోకం...


ఒకటే నిజం......




నేను కవిత రాయటం... మీరు చదవటం
అంతే!!

2 comments: