Monday, 23 November 2009

ఆదివారం

సారి ఆదివారం సారీ తో మొదలైంది. భిన్న కారణాల వల్ల మా శ్రీకాంత్ గాడి చెల్లి పెళ్ళికి వెల్లలేకపోయా. తోడుగాఎవరు లేక, ఉన్న ఒక్క ఆదివారంలో 6 గంటలకు పైగా బస్సు ప్రయాణం(అది కూడా ఒక్కడినే) చేసేందుకు నా బద్ధకం సహకరించని కారణంగా వెళ్ళటం కుదరలేదు. నిజం చెప్పాలంటే బాగా అలసిపోయి ఉన్న కారణంగా అలారం నన్నుఅనుకున్న సమయానికి లేపలేకపాయింది(శనివారం రాత్రి 12 కి చేరా నేను ఇంటికి). ఏదేమైనా వెళ్ళలేకపోయినందుకు నిద్ర లేవగానే బాధ పడటం జరిగింది. ఎలాగూ సెలవు అవటంతో 10:30 వరకూ లేవకుండా ఉన్న నన్ను నిద్ర లేపింది శేఖర్ కమ్ముల 'గోదావరి'. అదేంటో తెలీదు జెడ్-తెలుగు వాడు ఆదివారం ఉదయం ఎప్పుడు అదే సినిమా వేస్తాడు. నేను కూడా మిస్ అవకుండా చూస్తాను(వీలుంటే!!). ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించదు గోదావరి సినిమా నాకు. సమంత్ ని చూస్తే నన్ను నేనే చూసుకున్నట్టు ఉంటుంది. సినిమాలో సుమంత్ కి రాజకీయాల మీద ఉన్న ఇంట్రెస్ట్, అమ్మాయిలతో మాట్లాడటంలో ఉన్న ఇబ్బంది రెండును నాకు లానే ఉంటాయి. ఇక సుమంత్ మాట్లాడే తీరు, చేసే పనులు కూడా కాస్త నాలానే ఉంటాయి. ఎక్కువ చెప్తున్నా కదా.... ఏదో నా ఆనందం.... వదిలెయ్యండి!! మొత్తానికి సినిమా అంతాచూసి కాని బ్రష్ వేస్కోలేదు నేను.

ఇక తర్వాత ఫ్రెష్ అయి మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి చేస్కొని కమల్ 'పోతురాజు' చూస్తూ కూర్చున్నా. ఇక్కడ ప్లాన్ అసలైతే మా విజయ్ గాడి పెళ్ళికి గిఫ్ట్ కొనటానికి వెళ్ళటం మా శ్రీనివాస్ గాడితో కలిసి. ఏదో మాట వరుసకు ఒకే ఊరని చెప్పుకున్నా వాడుండే
కూకట్ పల్లి నుండి నేనుండే లక్డికపుల్ కి బస్సు లో రావాలంటే అంత ఈజీ ఏం కాదు. అందుకే వాడు వచ్చేవరకు కాస్త టైం ఉంది కాబట్టి మీకు పోతురాజు గురించి చెప్తా. పోతురాజు అంటే ఇక్కడో విషయంచెప్పాలి. సినిమా రిలీజ్ ఐనప్పుడు నేను నిజామాబాదు లో ఇంజనీరింగ్ చేస్తున్నా. కమల్ సినిమా రిలీజ్ అనగానే అస్సలు మిస్ అవొద్దని ముందే అడ్వాన్సు బుకింగ్ చేయించా మొదటి ఆటకు నాకు, మా మిత్రులు విజయ్, మనీష్, శ్రీనివాస్, విశాల్ మరియు వినయ్ లకు. తీరా సినిమా చూడటానికి వెళితే అక్కడ మొత్తం కలిపి 100 మంది ఉన్నారు. మా వాళ్లు నన్ను ఒక లెవెల్ లో తిట్టినా, మన కమల్ సినిమాకి మనం అడ్వాన్సు బుక్ చేస్కున్నం. వేరే జనంతోమనకేం పని అని సర్దిచెప్పా. సినిమా ఏంటంటే ఒకే కథని ఇద్దరు వ్యక్తులు వాళ్ల వాళ్ల పద్ధతిలో చెప్పటం. అంటే ఒకే కథనిరెండు సార్లు చూపిస్తారు. ఇంక మా విశాల్ గాడు నన్ను ఒక రకంగా తిట్టాడు... ఏరా కమల్ సినిమా అని చెప్పి ఒకటే సినిమాను రెండు సార్లు చూపించి అదే క్రియేటివిటీ అంటారా అని చెప్పి!! నిజానికి స్క్రీన్-ప్లే పరంగా ఇదొక అద్భుతమైన సినిమా. ఎన్ని సార్లు చూసినా నేను ఇప్పటికీ చాలా ఇష్టం గా చూసే సినిమాల్లో ఇదొకటి. కమల్ కి దేశ, విదేశాలలో బోల్డు అవార్డులు అందించిన సినిమా 'పోతురాజు'. మేస్ట్రో ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం చూసే ప్రేక్షకులకి ఆయనఎందుకంత గొప్ప సంగీత దర్శకులో మరోసారి రుజువు చేసేలా ఉంటాయ్. కమల్ నటన గురించి నేను వేరే చెప్పక్కర్లేదు మీకు. దర్శకుడిగా మాత్రం కమల్ 100 కి 500 మార్కులు కొట్టేస్తాడు. అది పోతురాజు కథ. సినిమా అవగానే మా శ్రీనివాస్ గాడు వచ్చేసాడు.

ఇద్దరం కలిసి ఎంత తిరిగినా నచ్చిన గిఫ్ట్ ఏది దొరకలేదు. ఇంతలో నాకు కాస్త తలనెప్పి స్టార్ట్ అయి తక్కువ సమయలోనే ఎంతో ఎక్కువయింది. 4 గంటలకు పైగా తిరిగినా ఏది నచ్చకపోవటంతో, ముందుగా అనుకున్న బ్యాక్-అప్ ప్లాన్ మీదే ఫైనల్ అవుదామని అనుకొని ఇక వెతికే ఓపిక లేక(నాకు) పీచే ముడ్ అనుకున్నాం. శీను గాడికి అక్కడే హ్యాండ్ ఇచ్చేసా. నా పరిస్థితి చూసి నేను బండి నడపగలనో లేనో అని పాపం వాడే నన్ను రూం దగ్గర దింపేసి వెళ్తా అన్నాడు. వీడిమంచితనం తో నన్నెప్పుడు అబ్బురపరుస్తునే ఉంటాడు మా శీను గాడు. వద్దులే నేనెలాగో డ్రైవ్ చేస్కుంటూ వెళ్ళిపోతా అని చెప్పి వాణ్ని పంపేసా. ముందు రూం కి వెళ్ళగానే పడుకోవాలి... ఐతే కాని నా బాడీ నా ఆధ్వర్యం లోకి వచ్చేలా లేదు. వెళ్ళాక కాస్త నడుము వాల్చినా నిద్ర రాకపోవంతో మా టీవీ రూం లో మొత్తం చిరిగిపోయినా అక్కడక్క మిగిన చిన్నముక్కలతో మేనేజ్ చేస్తున్న మా ఇంటి ఓనర్ ఇచ్చిన సోఫా లో పడుకున్డిపోయా. ఎలాగో రిమోట్ చేతికి దొరకటంతోకాసేపు ఇంగ్లాండ్, దక్షిణ ఆఫ్రికా మధ్య జరుగుతున్న పరిమితి ఓవర్ల(50) క్రికెట్ మ్యాచ్ చూసా. కాలింగ్ వుడ్ సెంచరీతో ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచింది. మళ్లీ రిమోట్ కి పని చెప్పి మా టీవీ లోగో కింద ఉన్న లైవ్ అనే పదం చూసి ఇప్పుడు ఏంటి లైవ్ అని ఆగా. అప్పుడు తెలిసింది 'లీడర్' సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అని. నా గత పోస్ట్ చదివిన వాళ్లకు తెలుసు నేను లీడర్ సినిమా కోసం ఎంత ఇంట్రెస్ట్ తో వెయిట్ చేస్తున్నానో. అది ఇంతవరకు చదవని వాళ్లు ఇప్పుడు చదవాలనుకుంటే దీన్నినొక్కమని విజ్ఞప్తి.

సింపుల్ గా చెప్పాలంటే 'లీడర్' సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల. హీరో 'రాణా' అని గిన్నిస్ బుక్ లో పేరు సంపాదించిన ప్రఖ్యాత తెలుగు ప్రొడ్యూసర్ రామానాయుడు గారి మనవడు. .వి.ఎం. వారు నిర్మిస్తున్న సినిమా. ప్రముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్(హీరో కి బాబాయి) వచ్చారు. సుమ వ్యాఖ్యాత. మొదటి సారి రాణా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. మనిషి బాగా పొడుగు(మహేష్, ప్రభాస్ కంటే కూడా). అందం గరించి నేను చెప్పలేను ఎందుకంటే నాకు తెలీదు. గొంతు గంభీరంగా ఉంది.... కాస్త వెంకటేష్, సురేష్ బాబు గొంతు ని పోలి ఉంది. చూస్తే మంచి హీరో మనకు దొరికినట్టే అనిపించాడు. శేఖర్ సెలక్షన్ కాబట్టి బానే నటిస్తాడని నమ్మొచ్చు. సినిమాలో ఉన్న ఆరు పాటలు బాగానచ్చేసాయి మాకు. వేటూరి రచన. మిక్కీ జే మేయర్ సంగీతం. అన్ని పాటల్లో అక్కడక్కడ తాను ఆల్రెడీ శేఖర్ కే చేసిన 'హ్యాపీ డేస్' లోంచి ట్యూన్స్ తీసుకొచ్చి పెట్టాడు.

మొదట 'మా తెలుగు తల్లికి' పాటతో స్టార్ట్ అయ్యింది. తెలుగు వారి జాతీయ గీతం లాంటి పాటను ఒరిజినల్ సాంగ్(గానం: కీర్తి శేషులు శ్రీ. టంగుటూరి సూర్య కుమారి గారు) అలాగే ఉంచి మధ్యలో లీడర్ టైటిల్ ట్రాక్ ని కలిపారు. బాగా వచ్చింది. మరో పాట 'వందేమాతరం' తప్పకుండా జనాల్లోకి చొచ్చుకొని పోతుంది అనటంలో అస్సలు సందేహం లేదు. తర్వాతి పాటలు 'హే... సి.ఎం.' మరియు 'అవుననా... కాదనా' మెలోడీలు. బాగున్నాయ్. తర్వాత 'రాజశేఖర' ఐటెం సాంగ్. శేఖర్ సినిమాలో మొదటి సారి ఐటెం సాంగ్ చూడొచ్చు మనం. పాటలో ఉనయభాను ఉందని సమాచారం. టీవీ వారి డాన్స్ ప్రోగ్రాం 'డీ' కి వ్యాఖ్యాత గా అందులో ఉన్న ఎందరో గొప్ప నృత్య దర్శకుల దగ్గర అప్పుడప్పుడు ఒకటి అరా స్టెప్స్ నేర్చుకునే అలవాటున్న భాను మరి తానేం నేర్చుకుందో చూపించే ప్రయత్నం చేస్తుందేమో!! ఆఖరి పాట 'శ్రీలు పొంగిన' అని ఉంది. దేశభక్తి గీతం... బాగుంది. ఎందరో సినీరంగ ప్రముఖులు వచ్చి రాణా కి, సినిమాకి(??) ఆశీస్సులు అందించారు. హీరో నే కాక సినిమాలో మంచి నటీ నట వర్గంఉంది. కోట శ్రీనివాస రావు, గొల్లపూడి మారుతి రావు(ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు అయి గొల్లపూడి వారిని చాలా రోజుల తర్వాత తెర మీద చూడొచ్చు మనం) , సుమన్, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు..... ఇలా అందరు మంచి నటులు ఉన్నారు సినిమాలో.

ఇక మొత్తం ఫంక్షన్ లో నాకు నచ్చింది బి.ఎన్.రెడ్డి(మేనేజింగ్ డైరెక్టర్, సి.బి..టి.) గారు చెప్పిన మాటలు బాగానచ్చాయి నాకు. ఆయనేం చెప్పారో ఆయన మాటల్లో: "శేఖర్ తో నాకు ఒక విభిన్న అనుబంధం ఉంది. సి.బి..టి. లోనే నా స్టూడెంట్ ఐన శేఖర్ తర్వాత అమెరికా వెళ్లి చదువుకొని ఇండియా వచ్చి సినిమాలు తీస్తూ ఒక రోజు నా దగ్గరకు వచ్చి హ్యాపీ డేస్అనే సినిమా తీస్తున్నాను. దానికి మీ పర్మిషన్ కావాలి ఇక్కడ కాంపస్ లో షూటింగ్ చెయ్యటానికి అని. స్టూడెంట్స్ కిఇబ్బంది అని నేను కాదంటే శేఖర్ ఒకటే మాట అన్నాడు. సర్, మీరు ఒప్పుకుంటే సినిమా తీస్తాను లేదంటే మానుకుంటాను ఎందుకంటే ఇది స్టూడెంట్స్ కథ అందులోనూ కాలేజీ లో ఉండగా జరిగిన సంఘటనలనుండి పుట్టిన కథ అని. మాటతో మా మెడలు వంచేసాడు. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి షూటింగ్ కి పర్మిషన్ ఇచ్చాం. సినిమా బాగావచ్చింది. మాత్రం అశ్లీలత లేకుండా, అర్థ నగ్న సన్నివేశాలు లేకుండా అందరికి నచ్చే మంచి సినిమా తీసాడు. ఇప్పుడు రాజకీయాల మీద తీస్తున్నాడు సినిమా. నేను కూడా రాజకీయాలలోకి వెళ్లి అన్ని పోగొట్టుకొని వచ్చినవాన్ని. ఇక్కడేరామానాయుడు ఉన్నారు, ఆయనకీ తెలుసు రాజకీయమంటే ఏంటో. మరి శేఖర్ ఏం చెప్తాడో రాజకీయం గురించిచూడాలి. సినిమా రంగం కూడా నాకు కొత్త కాదు. ఒక సినిమా తీసి పెద్ద ఫ్లాప్ ఇచ్చాను. దాని షూటింగ్ మా ఇంట్లోనేజరిగింది. అప్పట్లో ఒక పత్రికా విలేఖరి రాసాడు... 'బి.ఎన్.రెడ్డి కాని బి.ఎన్.రెడ్డి పెళ్లి కాని పెళ్లి ని స్టూడియో కాని స్టూడియో లో తీసి సినిమా కాని సినిమా అనిపించాడు అని!!'. ('పెళ్లి కాని పెళ్లి' సినిమా పేరు. బి.ఎన్.రెడ్డి అని తెలుగు చిత్రపరిశ్రమలో పాతతరం రచయిత, దర్శకుడు, నిర్మాత. చాలా మంచి సినిమాలు తీసారు. బి.ఎన్.రెడ్డి బి.ఎన్.రెడ్డికాదు అని అర్థం వచ్చేలా రాసాడు విలేఖరి)." మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగింది. నాకు పాటలు నచ్చాయి. ఇంకాసినిమా మీద అంచనాలు పెరిగాయి. ప్రస్తుతానికి పాటలు వినాలి కొద్ది రోజులు. దీని తర్వాత తేజ లో అనుకుంటా గర్ల్ ఫ్రెండ్ అని రోహిత్ నటించిన సినిమా చూసే ప్రయత్నం చేసి చూడలేక చూడలేక పడుకోటానికి వెళ్ళిపోయా. చాలా రోజుల తర్వాత నాకు దొరికిన ఖాళీ ఆదివారం ఇలా గడిచిపోయింది.

చాలా పెద్ద పోస్ట్ రాసానని నాకు తెలుసు. ఏదో ఊరికే అలా మూడ్ వచ్చింది అంతే. సారికి నన్ను తిట్టుకోకుండావదిలెయ్యండి... ప్లీజ్!!

2 comments:

  1. hi rock,chala rojula taruvata ...enta petta matter rasavu but ...ne paata rojulu chala marichipoyavu nuvvu ....poturaju movie tickets konnadi manamae ..paiga okae movie rondu sarla ani cheppavu chudu adhi annadi nenu(Vishal) kaadu vinay ..basical ga nenu ...kamal bhai fan paiga naaku nacchina movies lo adhi kuda okkati ....a roju jarigindi ...perfecgt ga gurtu vunnadi ..inko week lo na blog lo motham perfect ga rastanu ..chala vishayalu marichipoyavu nuvvu ..andulo

    ReplyDelete
  2. k mama. raayi nee blog lo detailed ga. Gnaapakala donteralo konni mukhyamaina sangathulu marchipoya.... Kshaminchu mitrama...
    I knw u r kamal bhai fan ani. Sry alaa annanduku...

    ReplyDelete